Employment Samachar

  • Home
  • Employment News
  • Railway Jobs
  • Software Jobs in India
  • Syllabus
  • Previous Papers
  • Admit Card
  • Answer Keys & Cut Off Marks
  • Result
  • All India University Results
  • All JNTU Fast Updates
  • Privacy Policy
  • Contact Us
Employment Samachar > Recruitment > AP High Schools Night Watchman Recruitment 2023 – 5388 Andhra Pradesh High Schools Night Watchman

AP High Schools Night Watchman Recruitment 2023 – 5388 Andhra Pradesh High Schools Night Watchman

April 25, 2023 ROHIT SHARMA 1 Comment

AP High Schools Night Watchman Recruitment 2023:- ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్మన్లు నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. నెలకు రూ.6 వేల గౌరవవేతనం. విధివిధానాలు ఖరారుచేసిన పాఠశాల విద్యాశాఖ:  రాష్ట్రంలో నాడు – నేడు కింద వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం. పాఠశాలల భద్రత, అక్కడి పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ నైట్ వాచ్మన్ల నియామడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరి నియామ కానికి అనుసరించాల్సిన విధివిధానాలపై పాఠశాల విద్యాశాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది. వాచ్మన్లుగా నియమితులైన వారికి నెలకు రూ.8 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ‘మనబడి నాడు నేడు’ కార్యక్రమాన్ని 2020-21 నుంచి మిషన్ మోడ్లో చేపట్టిన సంగతి తెలిసిందే. దశల వారీగా ఆయా పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ తో కూడిన టాయిలెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్ధులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ రాకో బోర్డులు, పాకశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, ప్రహరీ రిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేయిస్తోంది. ఫేజ్-1 కింద 15, 715 పాఠశాలల్లో ఈ పనులు పూర్తవగా ఫేజ్-2 కింద 22,228 పాఠశాలలను పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన పాఠశాలలను ఫేజ్-3లో అభివృద్ధి చేస్తారు.

ఇదే కాకుండా మరుగుదొడ్ల నిర్వహణ నిధిని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కోసం అన్ని పాఠశాలలకు పారిశుధ్య కార్మికులుగా ఆయాలను నియమించారు. మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు రసాయనాలు, సాధనాలను కూడా ప్రభుత్వం అందించింది. నాడు-నేడు ఫేజ్-2 కింద పాఠశాలల్లో ఈ మౌలిక సదుపాయాలతో పాటు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ)లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటుచేస్తున్నారు. నాడు- నేడు ఫేజ్-1 కింద పనులు పూర్త నైట్ వాచ్మన్ విధులు పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి. పని దినాల్లో మరుసటిరోజు పాఠశాల తెరిచే వరకు విధుల్లో ఉండాలి. ఇతర రోజుల్లో కూడా విధుల్లో ఉండాలి. సంబంధిత ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో పనిచేయాలి. రాత్రి కాపలాడారు విధుల్లో ప్రధానమైనది. పాఠశాల ఆస్తి అయిన భవనం/ప్రాంగణం, ఇతర వస్తువులు, పరికరాలకు రక్షకుడిగా పని చేయాలి. పాఠశాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా చూడాలి. ఏవైనా అసాధారణ కార్యకలాపాలు జరిగిన ప్పుడు, అగ్నిప్రమాదం వంటివి ఏర్పడినప్పుడు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సంబంధిత హెడ్ మాస్టరు, సమీప పోలీస్ స్టేషనీరు, అగ్నిమాపక విభాగానికి నివేదించాలి.

మార్గదర్శకాలు..

  1. పేరెంట్ కమిటీల ద్వారా పాఠశాలల్లో నైట్ వాచ్మను నియమించాలి.
  2. ఇప్పటికే నియమితులైన ఆయా/కుక్ కమ్ హెల్చర్ భర్తకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
  3. గ్రామం/వార్డులో మాజీ సైనికులకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలి.
  4.  వీరెవరూ అందుబాటులో లేకపోతే ఇతర వ్యక్తిని నియమించవచ్చు.
  5. నైట్ వాచ్మన్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక నివాసి అయి ఉండాలి.
  6. ఆ వార్డులో అందుబాటులో లేకుంటే, సంబంధిత పట్టణ ప్రాంతాల నివాసిని ఎంపికచేయాలి.
  7. వయసు 60 ఏళ్లలోపు ఉండాలి. ఇప్పుడు గుర్తించిన 5.388 పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలల్లో నియమించకూడదు.
  8. ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.8 వేల చొప్పున టాయిలెట్ మెయింటెవెన్స్ ఫండ్ నుంచి చెల్లించాలి.

AP High Schools Night Watchman Recruitment

AP High Schools Night Watchman Recruitment 2023

Name Of The GovernmentGovernment of Andhra Pradesh, School Education
Post NamesNight Watchmans
Number Of Posts5388
CategoryEmployment News
Registration ScheduleStarted
Official Sitegramawardsachivalayam.ap.gov.in

పాఠశాలల్లో నేర్చుకున్న పాఠాలను ఇంటి వద్ద కూడా అభ్యాసం చేసేందుకు వీలుగా ఐఏప్పీలలోని కంటెంట్ తో కూడిన ట్యాబులను రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. వీటికోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ పరికరాలను, మౌలిక సదుపాయాల వస్తువులను రక్షించడం, భద్రంగా ఉండేలా చూడడం ఇప్పుడు ఎంతో ప్రాధాన్యంగా మారింది. వీటితోపాటు పాఠశాలల ఆవరణలోకి సంఘవిద్రోహశక్తులు ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్మన్లను సాయంత్రం పాఠశాల గార్డెన్ కు నీరుపోయాలి. ఎప్పటికప్పుడు ఆర్వో ప్లాంట్ను శుభ్రం చేయాలి.

పాఠశాలకు సంబంధించిన మెటీరియలు తీసుకురావడం, వాటిని హెచ్ఎంకు అందించడం చేయాలి. స్కూలుకు సంబంధించి హెచ్ఎం డెప్పే ఇతర పనులను చేయాలి. నైట్ వాచ్మన్ పనిని హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. 2024 మే 1వ తేదీ నుంచి పాఠశాలల్లో వాచ్ మన్లను నియమించేలా చర్యలు తీసుకోవాలి. నైట్ వాచ్మన్ రిజిస్ట్రేషన్ సంబంధిత హెడ్ మాస్టర్ ఐ.ఎం.ఎ.ఎస్ యాప్ చేపట్టాలి. నాచ్మన్లను నియమించిన అనంతరం ఆ వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలి. మొత్తం స్కూళ్లలో ప్రస్తుతం గుర్తించిన 5.388 నాన్ రెసిడెన్షియల్ (నివాసీతర) ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్క వాజ్మ నేను నియమించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ డాక్టర్ నిధిమీనా మెమో విడుదల చేశారు.

Applying Links

Abstract AP High Schools Night Watchman Recruitment 2023

Recruitment AP High Schools Night Watchman

Comments

  1. K.balakrishna says

    April 29, 2023 at 3:50 pm

    Sir ap high school night watchman online start date appudu please detail cheppandi

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • JNTUK 2-2 Result 2023 | JNTU Kakinada 2-2 Regular, Supply, B.Tech, B.Pharmacy Result, Marks Memo @ jntukresults.edu.in
  • JNTUK 3-2 Result 2023 | JNTUK B.Tech, B.Pharmacy 3-2 Regular, Supplementary Exam Result @ www.jntuk.edu.in
  • JNTUK 2-1 Result 2023 | JNTUK B.Tech, B.Pharmacy 2-1 Results, Marks Memo @ jntukresults.edu.in
  • JNTUK 3-1 Time Table 2023 – Download JNTU Kakinada B.Tech, B.Pharmacy 3-1 Regular/ Supply Time Table @ www.jntuk.edu.in
  • JNTUK 3-2 Time Table 2023 | JNTUK B.Tech, B.Pharmacy 3-2 Reg/ Supply Time Table @ www.jntuk.edu.in

Copyright © 2023 Employment Samachar