YSR Kalyanamasthu 2023: రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు అందిన దరఖాస్తులకు నగదు బదిలీకి ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవననిర్మాణ కార్మికులు (బీవోసీడబ్ల్యూడబ్ల్యూబీ) కుటుంబాలకు చెందిన అడపిల్లల పెళ్లికి ఆర్థికసాయం అందించేందుకు అక్టోబర్ 1, 2022 న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించారు. అర్హులు ఈ పథకానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏడాదిలో నాలుగు త్రైమాసికాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తరువాత 15 రోజుల్లో సచివాలయం, మండల, జిల్లాస్థాయిల్లో పరిశీలించి నగదు బదిలీ చేయనున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య జరిగిన వివాహాలకు ఈ నెల 31 వరకు (January 31st 2023) నవశకం లబ్దిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటికి ఫిబ్రవరిలో నగదు బదిలీ చేయనున్నారు.
విద్యను ప్రోత్సహించడం, పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించడం, బాల్యవివాహాలను అరికట్టడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ పథకానికి కొన్ని నిబంధనలు విధించింది. వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండడంతోపాటు వివాహతేదీ నాటికి వధువుకి 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాల వయసు ఉండాలని నిర్దేశించింది. వివాహం జరిగిన 60 రోజుల్లోగా నవశకం పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం గత ఏడాది అక్టోబర్ 1 తర్వాత వివాహాలు చేసుకున్న వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు ఆవకాశం కల్పించారు. అందిన దరఖాస్తులను సచివాలయం, మండల, జిల్లాస్థాయిల్లో 15 రోజుల్లో ఆడిట్ చేస్తారు. ఇలా ఏడాది కాలంలో జరిగిన వివాహాలకు నాలుగు విడతలుగా (ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ త్రైమాసికాల్లో) ఆర్థికసాయం విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
YSR Kalyanamasthu 2023 Information
State Government | Government of Andhra Pradesh |
Scheme Name | YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa |
Launched Date | 01st October 2022 |
Eligible Category | SC, ST, BC, Minority, Divyang, BOCWWB |
Purpose | Money Help for Financially Weaker Womens of Andhra Pradesh for marriage purpose |
Site | navasakam.apcfss.in |
దరఖాస్తు నుంచి నగదు విడుదల షెడ్యూల్ ఇలా
Online Registration | Amount Release |
1st October to 31st December | February |
1st January to 31st March | May |
1st April to 30th June | August |
1st July to 30th September | November |
YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa Payment Details
ఎవరికీ | ఎంత |
SC, ST, Minority | 1 Lakh |
SC, ST కులాంతర వివాహం | 1 Lakh 20 Thousand |
BC | 50 Thousand |
BC కులాంతర వివాహం | 75 Thousand |
దివ్యంగులు | 1 Lakh 50 Thousand |
భవననిర్మాణ కార్మికులు | 40 Thousand |
YSR కళ్యాణమస్తు 2023 & YSR షాదీ తోఫా కి దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
- అర్హులైన అక్క చెల్లెమ్మలు ఎవరికీ ఐతే పెళ్ళి అయిందో వాళ్ళు గ్రామా వార్డ్ సచివాలయాలు ద్వారా అప్లికేషన్ పొందాలి.
- దరఖాస్తు నింపి, తగిన పత్రాలు మరియు పెళ్లి కార్డు జత చేయాలి మరియు సచివాలయం లో అందజేయాలి.
- దరఖాస్తు ఇచ్చిన 15 రోజుల తరువాత సచివాలయం పరిధిలో, మండల్ పరిధిలో, డిస్ట్రిక్ట్ పరిధిలో వెరిఫికేషన్ చేస్తారు అధికారులు.
- తరువాత అర్హులైన వాళ్ళకి నగదు అకౌంట్లో జమ చేస్తారు.
For more details about YSR Kalyanamasthu Scheme Eligibility, Application and other details follow www.employmentsamachar.in. Or else visit your Grama/ Ward Sachivalayam.
Leave a Reply